బాబోయ్.. రోబో టీజర్ సునామి మొదలైంది ?

Thursday, September 13th, 2018, 01:34:11 PM IST

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటిస్తున్న రోబో 2. 0 సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన ప్రేక్షకులకు కాస్త ఊరటనిచ్చేలా రోబో 2. 0 టీజర్ ని వినాయక చవితి సందర్బంగా ఈ రోజు ఉదయం విడుదల చేసారు. టీజర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేగుతుంది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విజువల్ వండర్ గా తెరకెక్కే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నెగిటివ్ షేడ్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ ని మిలియన్స్ వ్యూస్ దాటిపోటు ఉన్నాయి. కేవలం 24 గంటల్లో ఈ టీజర్ సంచలనం క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. నేటి రేడియేషన్ వల్ల పశుపక్షాదులకు ముప్పు వాటిళ్లుతున్న నేపథ్యంలో అక్షయ్ కుమార్ వాటిని రక్షించే పనిలో పడ్డాడు. ఈ విషయంలో జనాలకు కూడా కీడు చేయడంతో రోబో అలియాస్ .. నాటి చిట్టిని వసికర్ రంగంలోకి దింపుతాడని అర్థం అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే వొళ్ళు జలదరిస్తుంది .. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నవంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments