రోబో 2 డిజిట‌ల్ రైట్స్ ద‌క్కించుకున్న అమెజాన్‌

Thursday, October 26th, 2017, 06:41:49 PM IST

ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెల్ జీ టీవీ దాదాపు 110 కోట్లు వెచ్చించి 2.ఓ (రోబో 2) శాటిలైట్ హ‌క్కులు ఛేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనే ఓ సౌత్ సినిమాకి ది బెస్ట్ డీల్ ఇది. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న క్రేజీ సినిమా ఇది.

ఇక తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. 2.ఓ డిజిట‌ల్ హ‌క్కులు క్ర‌య‌విక్ర‌యాలు పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. దాదాపు 20- 30 కోట్ల మేర వెచ్చించి ప్ర‌ముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్ 2.ఓ డిజిట‌ల్ హ‌క్కుల్ని కైవ‌శం చేసుకుంది. ప్ర‌ముఖ త‌మిళ సినిమా విశ్లేష‌కుడు సురేంద‌ర్ ఎం.కె ఈ డీల్ వివ‌రాల్ని వెల్ల‌డించారు. “అమెజాన్ 2.ఓ డిజిట‌ల్ హ‌క్కులు సొంతం చేసుకుంది. 30 కోట్లు, అంత‌కు మించి డీల్ సాగి ఉండొచ్చ‌“ని వెల్ల‌డించారు. 2018 జ‌న‌వ‌రిలో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు అంతే భారీగా మార్కెట్ జ‌రుగుతోంద‌న్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 600 – 1000 కోట్ల మ‌ధ్య ప్ర‌పంచ‌వ్యాప్త‌ ప్రీరిలీజ్ బిజినెస్ సాగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.