ఆస్ట్రేలియన్ ఓపెన్ ని ఎగరేసుకున్న ఫెదరర్..!

Sunday, January 29th, 2017, 06:18:17 PM IST

sport
సుదీర్ఘ విరామం తరువాత కూడా తనలో సత్తా ఇంకా తగ్గలేదని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ నిరూపించాడు. మెల్బోర్న్ లో నాదల్ తో జరిగిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్ లో ఫెదరర్ విజయం సాధించాడు. ఆదివారం వీరిరువురి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో ఫెడరర్ 6-4, 3-6, 6-1,3-6, 6-3 తేడాతో స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ ను ఓడించి టైటిల్ ను సొంతం చేసకున్నాడు.దాదాపు ఐదేళ్ల తరువాత ఫెడరర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని గెలవడం విశేషం.

దాదాపు 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. తొలి నాలుగు సెట్ లలో ఫెదర్ రెండు సెట్లు, నాదల్ రెండు సెట్లు గెలుచుకున్నారు. ఇక నిర్ణయాత్మకమైన ఇదో సెట్ కీలకంగా మారింది. ఐదో సెట్ లో మొదట తడబడిన ఫెడరర్ ఆతరువాత పుంజుకుని 6 – 3 తో విజయం సాచింది టైటిల్ ని ఎగరేసుకునిపోయాడు.