వరల్డ్ రికార్డ్: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన రోహిత్..!

Monday, June 10th, 2019, 06:24:38 PM IST

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ 2019లో కొన్ని అరుదైన రికార్డులు నమోదవుతున్నాయి. అందులోనే భాగంగా నిన్న జరిగిన ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్‌లో భాగంగా ఇండియన్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత ఆస్ట్రేలియాపై 2వేల పరుగులు చేసిన ఇండియన్‌ బ్యాట్స్‌మెన్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రేలియాపై 2వేల పరుగులను పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్ స్థానంలో చేరిపోయాడు.

అయితే నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భాగంగా ఒక జట్తుపై తక్కువ మ్యాచులలోనే ఎక్కువ పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్ స్థానాన్ని బద్దలుకొట్టి టాప్ ప్లేస్‌లోకి చేరుకున్నాడు రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 40 మ్యాచులలో 2 వేల పరుగులు సాధిస్తే రోహిత్ శర్మ మాత్రం అదే ఆస్ట్రేలియాపై కేవలం 37 మ్యాచులలోనే 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఏది ఏమైనా రోహిత్ శర్మ ఖాతాలో ఇది కూడా ఒక గొప్ప మైలురాయి అనే చెప్పుకోవచ్చు.