నామినేటెడ్ ప‌ద‌వుల్లో రోజా, అంబ‌టి?

Sunday, June 9th, 2019, 11:32:41 AM IST

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌. సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వ‌ర్గాల వారికి ప్రాధాన్య‌తను క‌ల్పిస్తూ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేశార‌ని, జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ కూర్పు బాగుంద‌ని స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. అదే స్థాయిలో పార్టీలో వాయిస్‌ని బ‌లంగా వినిపించిన రోజా, అంబ‌టి రాంబాబుల‌కు జ‌గ‌న్ మొండిచేయిచ్చాడ‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కార‌ణాలు ఏవైనా వాటిని చూపిస్తూ పార్టీలో సీనియ‌ర్లు, పార్టీ కోసం చాలా ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నారు అలాంటి వారిని ప‌క్క‌న పెట్ట‌డం ఏమీ బాగాలేద‌న్న‌ది మెజారిటీ వ‌ర్గం వాద‌న‌. దీన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న జ‌గ‌న్ వారి కోసం కొత్త ప‌ద‌వులు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

రోజా, అంబ‌టికి నామినేటెడ్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టాల‌న్న ఆలోచ‌న‌లో సీఎం జ‌గ‌న్ వున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డా ఓ స‌మ‌స్య వుంది. అత్య‌ధిక మంది ఎమ్మెల్యేలు గెల‌వ‌డంతో ప్ర‌తి జిల్లా నుంచి అత్య‌ధికంగా మంత్రి ప‌ద‌వులు ఆశించారు. అయితే చివ‌రి నిమిషంలో వైఎస్ జ‌గ‌న్ సామాజిక న్యాయం అనే ట్విస్ట్ ఇవ్వ‌డంతో చాలా మంది అసంతృప్తితో వున్న‌ట్లు తెలుస్తోంది. వారంద‌రినీ బుజ్జిగించి నామినేటెడ్ పోస్టులు కేటాయించ‌డం కూడా అంత ఆశామాషీ వ్య‌వ‌హారం కాదు. అంద‌రిని స‌మాధాన ప‌రిచి రోజా, అంబ‌టికి నామినేటెడ్ ప‌ద‌వుల్ని ఎలా కట్ట‌బెడ‌తారో, మంత్రి ప‌ద‌వుల్ని కాద‌ని వాటిని రోజా, అంబ‌టి స్వీక‌రిస్తారా? అన్న‌దే ఇక్క‌డ ఆలోచించాల్సిన విష‌యంగా మారింది.