సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయిపోయిన రోజా.!

Tuesday, March 24th, 2020, 10:28:38 AM IST

మొత్తం మన దేశంలో నమోదు అవుతున్న కరోనా ప్రభావంతో పోల్చితే మన ఆంధ్రరాష్ట్రంలో దాని ప్రభావం కాస్త తక్కువే ఉందని చెప్పాలి. అది కూడా ఎక్కడా శృతి మించకుండా ఉండేందుకు జగన్ సర్కార్ భద్రతా చర్యలను మరింత ఉదృతం చేసారు.

అలా తమ గ్రామా వార్డు వాలంటీర్లతో ఇప్పటికే పలు చోట్ల పనులు కూడా చేస్తున్న నేపథ్యంలో అసలు అలంటి పనులు ఎక్కడా జరగడం లేదంటూ ఇవన్నీ వైసీపీ వారు కేవలం ఆర్భాటాల కోసం చేస్తున్నారు అంటూ విమర్శలు కూడా నేకం వినిపించాయి.

అయితే వైసీపీ నగరి ఎమ్మెల్యే మరియు ఏపీఐఐసీ ఛైర్మెన్ అయినటువంటి ఆర్కే రోజా కొన్ని పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. తమ గ్రామ మరియు వార్డు వాలంటీర్లు కరోనాను ఎదుర్కొంటు ఎంతలా కష్టపడుతున్నారో చూడండి అంటూ ఓ ట్వీట్ పెట్టగా అక్కడ మొదలయ్యింది.

కనీస అవగాహన లేకుండా పక్క రాష్ట్రంలో ఫోటోలను తీసుకొచ్చి ఎలా పెడతారు అని అసలు పోస్టులు ఫోటోలు తీసుకొచ్చి ఇతర పార్టీల అభిమానులు రోజాకు షాకిచ్చారు.ఎక్కడో హైదరాబాద్ లో జరుగుతున్న ఫోటోలను రోజా మరియు వైసీపీ వాళ్ళు తమ ఖాతాలో వేసేసుకొని ప్రజలను మభ్య పెడుతున్నారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.