బిగ్ బ్రేకింగ్ : ఫుల్ క్లారిటీతో సంచలనం రేపిన రోజా.!

Wednesday, June 12th, 2019, 10:50:13 AM IST

ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రోజా విషయంలో కలకలం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అస్సలు రోజాకు మంత్రి పదవి దక్కకపోవడం ఏమిటని ఇప్పటికీ చాలా మంది పార్టీ నేతలు సహా పార్టీ శ్రేణులకు కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది.ఖచ్చితంగా రోజాకు మాత్రం జగన్ క్యాబినెట్ లో చోటు దక్కుతుందని అంతా అనుకున్నా సరే జగన్ మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేసేసారు.

దీనితో రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంతో రాజకీయ వర్గాల్లో అనేక పుకార్లు షికార్లు చేసాయి.రోజా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారని అంతే కాకుండా కావాలనే మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం రోజున హాజరు కాలేదని అనేక రకాల వార్తలు బయటకు వచ్చాయి.కానీ నిన్నటితో రోజా తనపై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం అంతటినీ తిప్పికొట్టి మరోసారి ఇలాంటి ప్రచారాన్ని తనపై చెయ్యొద్దు అని క్లారిటీ ఇచ్చేసారు.తనని జగన్ పిలిచిన మాట వాస్తవమే కానీ తనకి ఏ మంత్రి పదవి ఇస్తానని చెప్పలేదని మరో మాట కూడా చెప్పేసారు.

అంతే కాకుండా తాను ఎవరి మీద అలక చెందలేదని మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎమ్మెల్యేలుగా మాకు ఏం పనుండదనే తాను హాజరు కాలేదాని తెలిపారు.తనకు పార్టీలో ఉన్న తొమ్మిదేళ్లు శ్రీ జగన్ ముఖ్యమంత్రి కావాలనే పని చేసాం తప్ప వేరే మంత్రి పదవులు ఏవో ఆశించి కాదని తెలిపారు.ఈ ఒక్క మాటతో తనపై పార్టీలో వ్యతిరేఖత తీసుకొద్దామని ప్రయత్నించే వారికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.