జగన్ వైపు నుండి నరుక్కురావాలనుకుంటున్న రోజా !

Friday, June 7th, 2019, 11:58:57 PM IST

వైకాపా అధికారంలోకి వస్తే మంచి పదవులు దక్కుతాయని ఆశపడిన వాళ్లలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. అందుకే 2014 తర్వాత అంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా రోజా మాత్రం వీడలేదు. కనీసం పుకార్లు కూడా రాకుండా నడుచుకున్నారు. పార్టీలో తిరుగులేని మహిళా నేతగా ఎదిగారు. జగన్ సైతం అడుగడుగునా ఆమెకు సపోర్ట్ చెస్టూ వచ్చారు.

గత ఎన్నికల్లో జగన్ గెలవగానే రోజాకు పెద్ద పోస్ట్ ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు జగన్ నుండి క్లారిటీ రాలేదు. పైగా జిల్లా నుండి పెద్దిరెడ్డి, భూమన లాంటి బలమైన నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దీంతో రోజాకు మంత్రివర్గంలో చోటు కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో లాభం లేదనుకున్న రోజా జగన్ వైపు నుండి నరుక్కురావాలని డిసైడ్ అయ్యారు.

అందుకే నిన్న తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ తన కష్టం జగన్ మోహన్ రెడ్డికి తెలుసని, పార్టీ కోసం కష్టపడ్డాను కానీ ఏ పదవీ ఆశించలేదని మీడియా ముందు చెప్పుకోవచ్చారు. తనకు పదవి ఇవ్వాలా వద్దా అనేది జగన్ నిర్ణయిస్తారని అన్నారు. దీన్నిబట్టి ఆమె నేరుగా ముఖ్యమంత్రికి తాను పదవి రేసులో ఉన్నానని గుర్తుచేసినట్టు అయింది.