రోజా సంచలన వాఖ్యలు – అమరావతికి వెళ్ళడానికి కారణం అదేనా…?

Tuesday, June 11th, 2019, 08:46:38 PM IST

ఏపీలో ఎన్నికల హడావుడి అంతా ముగిశాక వైసీపీ అధికారంలోకి వస్తుందని అందరు అనుకున్నారు. అప్పటి నుండే పార్టీల కీలకంగా ఉన్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా కి మంత్రి పదవి వస్తుందని అందరు ఊహించారు కానీ, జగన్ ఏర్పాటు చేసుకున్నటువంటి తన మంత్రి వర్గం లో నగరి ఎమ్మెల్యే రోజాకి ఎలాంటి మంత్రి పదవి దక్కలేదు. అప్పటి నుండి రోజా అసంతృప్తిగా ఉన్నారని, అందుకనే సరిగా బయటకు రావడం లేదని పలు వార్తలు వచ్చాయి… అయితే నేడు అమరావతిలో సీఎం జగన్ కలిసిన రోజా, అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని, కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. మంత్రి పదవి రానందుకు తానూ అలక వహించినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కూడా పుకార్లేనని రోజా అన్నారు. అంతేకాకుండా తనకు నామినేటెడ్ పోస్టు ఇస్తారన్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని రోజా స్పష్టం చేశారు.

జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా చూడటంకోసమే ఇన్ని ఏళ్లుగా కష్టపడ్డామని, రాజన్న రాజ్యం తీసుకరావడానికి తామంతా కలిసి కష్టపడతామని అన్నారు… ప్రస్తుతానికి తనకు ఎలాంటి మంత్రి పదవి మీద ఆశలు లేవని, నన్ను గెలిపించిన నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, నా నియోజకవర్గ ప్రజల ఋణం తీర్చుకుంటానని చెప్పారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, తామంతా కూడా ముఖ్యమంత్రి అయినట్లేనని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను, నవరత్నాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.

కాగా నేడు అమరావతిలో సీఎం జగన్ ని కలుసుకుని చాలా సేపు చర్చలు జరిపారని సమాచారం. కాగా కేవలం కుల సమీకరణాల వల్లే తనకు మంత్రి పదవి రాలేదని, అంతేతప్ప మరేకారణాలు లేవని రోజా వెల్లడించారు. అయితే తనని అమరావతి రావాలని ఎవరూ పిలవలేదని, కేవలం సీఎం ని కలుసుకోడానికే వచ్చానని రోజా చెప్పారు.