తెలంగాణ గవర్నర్ ని కలుసుకున్న ఎమ్మెల్యే రోజా – ఎందుకంటే…?

Tuesday, February 4th, 2020, 09:40:56 PM IST

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ని, ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా నేడు కలుసుకున్నారు. కాగా కొద్దిసేపటిక్రితం రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసైను మర్యాదపూర్వకంగా కలుసుకొని, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక పుష్పగుచ్ఛం అందించారు. ఈమేరకు ఎమ్మెల్యే రోజా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సంబంధిత వీడియో ని పోస్టు చేశారు. అయితే ఆ తరువాత ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజాని ఇదే విషయమై ప్రశ్నించగా, ఇక్కడికి వచ్చిన కారణంగానే మర్యాదపూర్వకంగా గవర్నర్ ని కలుసుకున్నానని చెప్పారు. అంతేకాకుండా ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు.