అసెంబ్లీ స్పీక‌ర్‌గా రోజా పేరు ఫైన‌ల్‌!

Sunday, June 2nd, 2019, 10:01:40 AM IST

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ కూర్పుపై గ‌త మూడు రోజులుగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే మూడు ద‌ఫాలుగా మార్పులు చేర్పులు చేసిన జ‌గ‌న్ మొత్తానికి తుది రూపు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఫ‌:న‌ల్ చేసిన జాబితాను ఈ రోజు సాయంత్రానికి వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. తొలి విడ‌త 15 మందితో మంత్రులుగా ప్ర‌మాణం చేయించ‌బోతున్నారు. సామాజిక న్యాయం ప్ర‌కారం జాబితాను సిద్ధం చేసిన‌ట్లు తెలిసింది. ఎస్సీ సామాజిక వ‌ర్గం నుంచి ఇద్ద‌రిని, ఎస్టీ నుంచి ఒక్క‌రిని, కాపు కోటాలో ఇద్ద‌రికి మంత్రి వ‌ర్గంలో అవ‌కాశం ఇవ్వ‌బోతున్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి పోటీ అధికంగా వుండ‌టం జ‌గ‌న్‌కు సంక‌టంగా మారిన‌ట్లు తెలుస్తోంది.

ఇం మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశిస్తున్న రోజాకు స్పీక‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెడుతున్నారు జ‌గ‌న్‌. వైసీపీలో రోజా ఫైర్ బ్రాండ్‌. అదే ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌కుండా చేసి స్పీక‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెడుతోంది. రెడ్డి స‌మాజిక వ‌ర్గానికి చెందిన రోజాకు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం వ‌ల్ల అత్య‌ధికంగా మంత్రి వ‌ర్గంలో రెడ్ల‌కు స్థానం క‌ల్పించిన‌ట్ల‌వుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే జ‌గ‌న్ రోజాను స్పీక‌ర్‌గా నియ‌మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బుగ్గ‌న‌ను స్పీక‌ర్‌గా నియ‌మించాల‌ని చూసినా ఆయ‌న‌కు స్పీక‌ర్‌గా వుండ‌టం న‌చ్చ‌లేద‌ని అందుకే ఆ స్థానంలో రోజాను స్పీక‌ర్‌గా ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది.