కోడెల మృతి వెనుక బాబుగారి హస్తం.. వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలనం..!

Wednesday, September 18th, 2019, 02:04:58 AM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న చనిపోయారు. వరుస కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల నిన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే కోడెల ఆత్మహత్యపై స్పందించిన టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అయితే టీడీపీ చేస్తున్న విమర్శలను వైసీపీ నేతలు గట్టిగానే తిప్పికొడుతున్నారు. అయితే కోడెల మరణంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసింది. చంద్రబాబు అవమానించడం వలనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని, కోడెల కలవడానికి వస్తే చంద్రబాబుగారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు. సొంత మామ, వంగవీటి రంగా వంటి వ్యక్తుల మరణం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని, ఇప్పుడు కోడెల మృతిపట్ల కూడా చంద్రబబౌ హస్తం ఖచ్చితంగా ఉందని అన్నారు. అంతేకాదు కోడెలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టలేదని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసులు నమోదయ్యాయని అన్నారు.