బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు వ్యక్తిత్వంపై రోజా షాకింగ్ నిజాలు..!

Monday, June 10th, 2019, 06:40:32 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా రెండు రోజుల క్రితం జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే ముందు నుంచి సీఎం జగన్ మంత్రివర్గంలో రోజాకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే కొన్ని సమీకరణాల నేపధ్యంలో రోజాకు మంత్రి పదవి దక్కలేదు.

అయితే జగన్ మంత్రివర్గ స్థానంలో ప్రస్తుతం చోటు దక్కకపోయినా ఐదేళ్లలో సీఎం జగన్ ఖచ్చితంగా రోజాను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇప్పటికే మాటిచ్చారట. అయితే తాజాగా ఎమ్మెల్యే రోజా ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై పలు ఆసక్తికర నిజాలు భయటపెట్టిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది. గతంలో చంద్రబాబుకు మంచి అడ్మినిస్ట్రేట‌ర్‌గా పేరు ఉండేదని, ఆయన ఏ పనైనా బాధ్యతతో నిర్వహించేవాడని, చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌గ‌ల రాజ‌కీయ నాయ‌కుడు అని అందరూ భావించేవారు. అయితే 2014లో మాత్రం ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి లోపల ఒక విధంగా, భయటకు ఒక విధంగా కనిపించిందని అసెంబ్లీలో ఆయన వైఖరే ఆయనకున్న మంచి పేరును దెబ్బతీసిందని ఆమె అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు గ‌త అసెంబ్లీ స‌మావేశాలలో అస‌భ్య‌క‌ర రీతిలో వ్య‌వ‌హ‌రిస్తుంటే సీఎం స్థాయిలో ఉన్న చంద్ర‌బాబు, స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ వారిని కనీసం అదుపు కూడా చేయలేదని, వారిని వీరే ప్రోత్సహించడం చూసి ఆ సమయంలో మాకు రక్తం ఉడికిపోయేదని దానిని చూసిన ఆ దేవుడే ఈ సారి వారికి సరైన బుద్ధి చెప్పడంటూ రోజా చెప్పుకొచ్చారు.