బిగ్ బ్రేకింగ్ : ఊహించని నిర్ణయం తీసుకున్న రోజా.?

Sunday, July 21st, 2019, 09:36:01 AM IST

ఇప్పుడు ఏపీ అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ఒక పక్క ప్రతిపక్ష పార్టీ అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంటే మరో పక్క కొన్ని కొన్ని చోట్ల ఆధిపత్య పోరు అంటూ అంతర్గతంగా బయటకు కనపడని గొడవలు రేగుతూనే ఉన్నాయి.ఇదిలా ఉండగా వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన నగరి ఎమ్మెల్యే రోజా ఆ ఆర్తి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నారు.

ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో అలక బూనారరని వార్తలు రావడం మళ్ళీ ఆ తర్వాత ఏపీఐఐసీ చైర్మెన్ గా నియమించారు..కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా పెద్ద యాక్టీవ్ గా పనులు చేస్తునట్టు కానీ పార్టీ కార్యకలాపాల్లో కానీ కనిపించలేదు.అదే విధంగా అసెంబ్లీ లో కూడా ఇన్ని రోజులు గడిచినా సరే రోజా గొంతు కూడా వినిపించకపోవడంతో దీనికి గల అసలు కారణం ఏమిటా అన్నది ఇంకా పాలుపోవడం లేదు.దీనితో రోజా ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

రోజా ఇక నుంచి మౌనంగానే ఉండేందుకు సిద్ధపడ్డారని అంతేకాకుండా ముందులా కాకుండా ఇపుడు ఆధ్యాత్మికత వైపు వెళ్లాలని ఆమె భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.దీనంతటికి తాను పార్టీలో ఇన్నాళ్లు వ్యవహరించిన తీరే కారణమని ఆమె భావిస్తున్నారని అందుకే ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో ఓ వార్త సంచలనంగా మారింది.అయితే ఈ వార్తను మాత్రం వైసీపీ అభిమానులు సింపుల్ గా కొట్టి పడేస్తున్నారు.