రోశయ్య చెప్పినట్టే తమిళనాడు లో అంతా జరుగుతోంది

Sunday, February 12th, 2017, 12:42:25 PM IST


తమిళనాడు లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇదివరకు ఎన్నడూ లేనిది అయితే కాదు. కొన్ని పరిస్థితులలో అలా జరుగుతూ ఉండడం చాలా కామన్ విషయమే. కానీ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు గురించి మాత్రం ఒక్కొక్కరూ ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉండడం విశేషం. గవర్నర్ పద్దతి గురించి తెలుగు వ్యక్తి రోశయ్య ని మీడియా ప్రశ్నలు వెయ్యగా… ఇంచార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న విద్యా సాగారరావు పుస్తకాలు బాగా చదువుతారు అనీ రాజకీయాల్లో కూడా గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి అనీ అన్నారు. అంతేకాదు.. గవర్నర్ నిర్ణయం తీసుకోవటానికి నాలుగైదు రోజులు పడుతుందని.. అప్పటివరకూ ఆయనేం చేయలేరన్నట్లుగా రోశయ్య ఒక అంచనాను వినిపించారు. అటు మీడియాకానీ.. ఇటు రాజకీయ వర్గాలు కానీ.. తమిళనాట ఏదో ఒకటి వెనువెంటనే జరిగిపోతుందన్న వాదనను పలువురు వినిపించారు. అయితే.. ఏదో జరుగుతున్నట్లుగా అనిపించినా.. ఏమీ జరగకుండా ఉండటం.. ఎప్పటికప్పుడు వాయిదాల మీదా వాయిదాలు పడటం కనిపిస్తుంది.చూస్తుండగానే.. నాలుగురోజుల గడిచిపోయిన పరిస్థితి. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న రోశయ్య లాంటి వారు.. తాజాగా నెలకొన్నపరిణామాలు చివరకు ఎక్కడి వరకూ వెళతాయన్నది అంచనా వేయగలరు.