రోష‌న్ చెర్రీతో స‌మానం: చిరంజీవి

Sunday, September 18th, 2016, 02:00:56 AM IST

chiru-and-roshan
శ్రీకాంత్ -ఊహ‌ల త‌న‌యుడు రోష‌న్ డెబ్యూ మూవీ నిర్మ‌లా కాన్వెంట్ ఈ శుక్ర‌వారం రిలీజైన సంగ‌తి తెలిసిందే. తొలి ప‌రిచ‌య‌మే రోష‌న్ స్క్రీన్ ప్రెజెన్స్‌ సూప‌ర్బ్ గా ఉంద‌ని టాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రిచే ప్ర‌శంలందుకుంటున్నాడు. భ‌విష్య‌త్తులో పెద్ద స్టార్ గా నిల‌బ‌డ‌తాడ‌ని కింగ్ నాగార్జున సైతం ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రోష‌న్ ను చెర్రీ తో స‌మానం అంటూ పోల్చి మాట్లాడారు. రోష‌న్ నా త‌మ్ముడు శ్రీకాంత్ కొడుకు. చిన్న‌ప్ప‌టి నుంచి బాగా తెలిసిన బిడ్డ‌. చెర్రీ, నా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ ఎలానో రోష‌న్ కూడా వాళ్ల‌తో స‌మానం అన్నారు. రోష‌న్ హీరో మెటీరియ‌ల్ అని ముందే తెలుసు. కాని ఇంత తొంద‌ర‌గా ఎంట్రీ ఇస్తాడ‌ని అనుకోలేదు. సినిమాలో రోష‌న్ క్యారెక్ట‌ర్ బాగుంది. రోష‌న్ కెరీర్ కు ఈచిత్రం మంచి ప్ల‌స్ అవుతుంది. .. అనీ త‌న అభిప్రాయాన్ని తెలిపారు చిరు.

ఇప్ప‌టికే రోష‌న్ కు టాలీవుడ్ పెద్ద‌ల అంద‌రి ఆశీర్వాచ‌నాలు అందాయి. ఇక కెరీర్ ను జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుని పోటీలో దూసుకుపోవ‌డ‌మే ఆల‌స్యం. ఇప్పుడు ఇమేజ్ అనే మాట లేకుండా సినిమాలు ఆడుతున్నాయి కాబ‌ట్టి రోష‌న్ కు మంచి భవిష్య‌త్తు ఉంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.