కాన్వెంట్ ను నమ్ముకుంటే నిండా ముంచింది ?

Wednesday, September 21st, 2016, 12:41:15 AM IST

nirmala-convent
టాలీవుడ్ లో కింగ్ నాగార్జున రొమాంటిక్ హీరోగానే కాకుండా పక్క బిజినెస్ మెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కొత్తదనాన్ని ఆకర్షించే నాగార్జున కొత్త టాలెంట్ ను పరిచయం చేయడంలో ముందుంటారు. లేటెస్ట్ గా అయన శ్రీకాంత్ తనయుడు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తూ .. ”నిర్మల కాన్వెంట్” చిత్రాన్ని తీసాడు. అన్నపూర్ణ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో నాగార్జున కూడా ఓ కీ రోల్ పోషించాడు. ఇక నాగార్జున ఇన్వాల్వ్ కావడంతో ఈ సినిమాకు బిజినెస్ బాగా జరిగింది. కొత్త హీరో, హీరోయిన్లు అయినా కూడా నాగార్జున ఉన్నాడన్న ఆశతో భారీ రేటుకు కొనుక్కున్నారు బయ్యర్స్. ముఖ్యంగా విడుదలకు ముందు భారీ ప్రమోషన్స్ చేసారు, ప్రతి ప్రమోషన్ లో నాగార్జున పాల్గొని ఊదరగొట్టారు. దాంతో భారీ హైప్ మధ్య విడుదలైన ”నిర్మల కాన్వెంట్” చిత్రం ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేదు ? ఈ సినిమా అన్ని ఏరియాలకు కలిపి ఏకంగా 10 కోట్ల బిజినెస్ చేశారట, కానీ సినిమా విడుదల తరువాత ఇప్పటి వరకు కేవలం 2. 36 కోట్ల వరకే వచ్చాయని, ఇక పై కలక్షన్స్ కూడా పెద్దగా వచ్చే అవకాశాలు లేనట్టే అని తెలుస్తోంది? దీనిబట్టి చుస్తే ఈ సినిమా బయ్యర్స్ కు భారీ నష్టమే జరిగింది. కథలో కొత్తదనం లేకపోవడం, పైగా చిన్న పిల్లలాంటి నటులతో ప్రేమకథను తెరకెక్కించడం, అందులోను నాగార్జున లాంటి నటుడి పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం లాంటి అంశాలు సినిమాను నీరు గార్చాయి. విడుదలైన ప్రతి సెంటర్ లోను కలక్షన్స్ నీరుగారి పోయాయి. మొత్తానికి నాగ్ ను నమ్ముకుంటే .. తీవ్ర నిరాశే మిగిలింది !!