RRR 2020 టార్గెట్‌?

Monday, June 11th, 2018, 10:11:22 AM IST

RRR (రాజ‌మౌళి-రామారావు-రామ్‌చ‌ర‌ణ్‌) సినిమా ఎప్పుడు రిలీజ‌వుతుంది? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? అస‌లింత‌కీ రాజ‌మౌళి ప్లాన్ ఏంటి? అంటే.. ఇదిగో ఇదే స‌మాధానం. ప్ర‌స్తుతం ఈ భారీ ప్రాజెక్టు కోసం అల్యూమినియం ఫ్యాక్ట‌రీ ప‌రిస‌రాల్లో రెండ‌క‌రాల లీజుకు తీసుకున్నారు. అక్క‌డ ఆర్ట్ డైరెక్ట‌ర్ సాబు సిరిల్ సార‌థ్యంలో సెట్స్ వేసేందుకు ప‌క్కాగా ప్లాన్ సిద్ధ‌మైంది. ఇప్ప‌టినుంచే సెట్స్‌ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇక న‌వంబ‌ర్‌లో చిత్రీక‌ర‌ణ ప్రారంభించి 2020లోనే రిలీజ్ చేయాల‌న్న‌ది జ‌క్క‌న్న ప్లాన్ అని తెలిసింది. న‌వంబ‌ర్ నాటికి అర‌వింద స‌మేత రిలీజైపోతుంది. అలానే చ‌ర‌ణ్ – బోయ‌పాటి సినిమా పూర్త‌వుతుంది. అప్పుడు ఆటోమెటిగ్గా ఆ ఇద్ద‌రూ రాజ‌మౌళి క్యూలోకి వ‌స్తారు. ఈ చిత్రాన్ని 300 కోట్ల బ‌డ్జెట్‌తో డివివి ఎంట‌ర్‌టైన్మెంట్స్ తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే.