రూ.1000 నోటు ఫేక్ – స్పష్టం చేసిన ఆర్బీఐ

Saturday, October 19th, 2019, 01:30:08 AM IST

భారతీయ రిజర్వు బ్యాంకు నేడు తాజాగా ఒక కీలక ప్రకటనను చేసింది. అయితే నోట్ల రద్దు తరువాత ఈ వార్త కూడా అదే మాదిరి నోట్ల రద్దు జరుగుతుందని చెప్పడంతో అందరు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈమేరకు రూ.2000 నోట్ల ముద్రీకరణ ని ఆపేసిన విషయం మనకు తెలిసిందే. కాగా ఈమేరకు రూ.1000 నోట్లను మళ్ళీ అమలులోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించుకుందనే వార్త బాగా ప్రచారం జరిగింది. అందుకు సంబందించిన ఒక 1000 రూపాయల నోటును కూడా విడుదల చేశారు. అయితే ఆ వార్త తో పాటే, ఆ ఫోటో లు కూడా గత కొంత కాలంగా సోషల్ మీడియా లో బాగానే చక్కర్లు కొట్టింది.

కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అని ఆర్బీఐ స్పష్టంచేసింది. కాగా ఇప్పటివరకు ఉన్నటువంటి నోట్లే చలామణి అవుతాయని, మళ్ళీ కొత్త నోట్ల ముద్రీకరణ జరిపేది లేదని తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసింది.