వంద‌ల కోట్ల క‌రెన్సీ ఎవ‌రు మింగేశారు?

Monday, September 26th, 2016, 01:13:52 PM IST

kcr
వ‌ర్షం వెలిసిపోయాక 300 కోట్లు ఖ‌ర్చు చేసి హైద‌రాబాద్ రోడ్లు పోయిస్తాం. నాళాల‌పై నిర్మించిన అక్ర‌మ‌క‌ట్ట‌డాల్లో 28 వేల భ‌వంతుల్ని కూల్చేస్తాం అంటూ సీఎం కేసీఆర్ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఇదే సంద‌ర్భంలో జీహెచ్ ఎంసీ ప‌రిధిలో జ‌రిగిన అవినీతిపై ఆయ‌నేం మాట్లాడ‌లేదే. మాట్లాడేందుకు అంత అవినీతి ఏం జ‌రిగింది?.. అని అంటారా? .. అయితే ఇదిగో ఇది చ‌ద‌వాల్సిందే.

ప్ర‌భుత్వ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం..ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో జీహెచ్ఎంసీ ఏకంగా 480 కోట్ల కేంద్ర నిధుల్ని ఖ‌ర్చు చేసింది. ఇక రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పు నిధుల ఖ‌ర్చు వేరే. రాజ‌ధానిలో 100 కిలోమీట‌ర్ల రోడ్ల మ‌ర‌మ్మ‌త్తుల‌కే ఏకంగా రూ.200 కోట్లు ఖ‌ర్చు చేశారుట‌. అయితే ఇంత పెద్ద మొత్తం అంత స్వ‌ల్ప ప‌రిధికే ఖ‌ర్చు చేసేశారు. అలాగ‌ని రోడ్లేమైనా స్ట్రాంగ్‌గా ఉన్నాయా? అంటే అదీ లేదు. ఒక్క వ‌ర్షానికి దారుణంగా కొట్టుకుపోయాయి. గుంత‌లు ప‌డిపోయాయి. ఇసుక‌, పిక్క‌రాళ్లు అన్నీ రోడ్డుపై తేలి క‌నిపిస్తున్నాయి. అయితే ఈ దుస్థితి ఎందుకొచ్చింది. క‌రెన్సీ క‌ట్ట‌ల‌న్నీ ఎవ‌రు మింగేసిన‌ట్టు? రోడ్ల కాంట్రాక్టుల‌న్నీ నాసిర‌కంగానే తూ.తూ మంత్రంగా న‌డిపించేయ‌డం వెన‌క ప్ర‌భుత్వాల అల‌స‌త్వం, అండ‌దండ‌లు లేవా? అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు దీనికి?