హాట్ టాపిక్: కోడెల కుమారుడికి బిగ్ షాక్…పలు కేసులు నమోదు!

Wednesday, October 16th, 2019, 10:39:16 AM IST

కోడెల శివ ప్రసాద్ కొడుకు శివరాం పై పలు కేసులు నమోదయ్యాయి. శివరాం కి గౌతమ్ హోండా షోరూం వుంది,ఇటీవలే అధికారులు దానిని సీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే రిజిస్ట్రేషన్ లేకుండా దాదాపు 40 వేలకు పైగా వాహనాలను అమ్మినట్లు పోలీస్ విచారణలో తేలింది. రవాణా శాఖ కోటి రూపాయలని జరిమానా విధించింది. ఇప్పటివరకు పన్ను కట్టకుండా ద్వి చక్ర వాహనాల్ని అమ్మడం తో ఇలా చేయాల్సి వచ్చింది. శివరాం కూడా కోటి రూపాయల్ని చెల్లించడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది.

గతంలో టిఆర్ లేకుండా బైక్ లు డెలివరీ చేస్తున్నట్లు శివరాం పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. గత ప్రభుత్వం వాటన్నిటిని చూసి చూడనట్లు వుంది.కానీ ప్రభుత్వం మారడం తో శివరాం లెక్కలు తెలుస్తున్నారు అధికారులు. విచారణ అనంతరం గుంటూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు శివరాం పై ఐపీసీ 406, 409, 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఒక్క షో రూమ్ పైనే ఇన్ని కేసులు నమోదయ్యాయి అంటే పలు విషయాల ఆరోపణలలో ఇంకెన్ని కేసులు నమోదవుతాయో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.