ఏపీలోనూ ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు…

Thursday, May 21st, 2020, 08:29:52 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించిన మహమ్మారి కరోనా కారణంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేశారు. ఈ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది చెప్పాలి. కాగా ప్రస్తుత పరిస్తితుల్లోరాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ని సడలిస్తూ పలు రంగాలకు మినహాయింపులు ప్రకటిస్తున్నారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడపడానికి అనుమతులు కూడా జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాగా గత కొంతకాలంగా లాక్‌డౌన్ కారణంగా డిపోల్లోనే నిలిచిపోయిన బస్సులన్నీ కూడా ఈ రోజు నుంచి రోడ్ల మీదకు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే నేడు ఉదయం 7 గంటలకు తొలి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. కాగాఈ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా కనీస భౌతిక దూరాన్ని పాటించాలని, అందరు కూడా మొహాలకు ధరించాలని, శానిటైసర్ తో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇకపోతే ఈ బస్సుల్లో ప్రయాణికులు టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ బస్సుల్లో కండక్టర్లు ఉండరు. ఇకపోతే సంబంధిత ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ… నగదు రహితంగా, పేపర్ లేకుండా టికెట్ ఇవ్వాలని చాలా కాలం కసరత్తు చేశాం. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం’ అని వాఖ్యానించారు.