ఆర్టీసీ విషయంలో అమలవుతున్న సీఎం కేసీఆర్ హామీలు…

Saturday, December 14th, 2019, 02:01:45 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె విరమించిన తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ సాక్షిగా ఆర్టీసీ కార్మికులకు అధికారికంగా కొన్ని వరాలు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ముఖ్యంగా ఆర్టీసీలో పని చేస్తున్న మహిళలకు ప్రత్యేక హామీలను ఇచ్చారు. కాగా మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీ, వారి యూనిఫామ్ మార్పు, ఇష్టమైన రంగులో యూనిఫామ్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కాగా ఈ మేరకు వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది.

అయితే ఈ హామీల్లో భాగంగా ముందుగా మహిళా ఉద్యోగుల యూనిఫాం రంగు మార్చి, వేరే రంగు యూనిఫామ్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుందని తాజా సమాచారం. ఈ మేరకు రాష్ట్రంలోని ఆర్టీసీ మహిళా ఉద్యోగుల నుండి వారి అభిప్రాయాలను కూడా స్వీకరించారని సమాచారం. అయితే ప్రస్తుతానికి మహిళా ఉద్యోగులు దరిస్తున్నటువంటి ఖాకీ రంగు చొక్కా కి బదులుగా, కొత్తగా ఎరుపు రంగు కానీ నీలం రంగుకు సంబందించిన చొక్కాని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే వాటితో పాటే రెండు జతల షూ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.