విశ్లేషణ: ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ గెలుపు తథ్యం!?

Tuesday, November 19th, 2019, 10:58:35 AM IST

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లని నెరవేర్చలంటూ సమ్మె ప్రారంభించి 45 రోజులు అవుతుంది. అయితే సోమవారం నాడు హైకోర్టు కార్మికులకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. లేబర్ కోర్ట్ లోకి ఆర్టీసీ సమ్మె కేసుని బదలాయించింది. అయితే హైకోర్టు కొన్ని నిబంధనల దృష్ట్యా ఆర్టీసీ సమ్మెని పరిష్కరించలేక కార్మిక శాఖ కి అప్పగించింది. రెండు వారాల్లోగా సరైన నిర్ణయాన్ని వెల్లడించాలని ఆదేశించింది.

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతం చేయాలనీ భావించారు. కానీ అది జరిగే పరిస్థితి కనబడేలా లేదు. హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు సడక్ బంద్ ని విరమించుకుంది.హైకోర్టు తెరాస ప్రభుత్వానికి పలుసార్లు చర్చలు జరపండి అని సూచించినప్పటికీ కేసీఆర్ వాటిని భేఖాతరు చేయలేదు. అంతే కాదు ఆర్టీసీ ని విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసారు. అంతేకాదు ఉన్నత న్యాయస్థాన కమిటీ కూడా అక్కర్లేదంటూ తెరాస ప్రభుత్వం తెలిపింది. సమస్య వున్నది కార్మికులకు కాబట్టి ఈ సమస్యని లేబర్ కోర్ట్ లో పరిష్కరించేందుకు రంగం సిద్ధమైంది.

ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీలో చాల ఎక్కువ రోజులు జరిగిన సమ్మె గా కార్మికులు భావిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫై విజయం సాదిస్తామని ధీమాగా వున్న కార్మికులకు కొన్ని అడ్డంకులు రావడం తో ఇప్పుడు అది కాస్త కష్టతరం అని చెప్పాలి. కేసీఆర్ హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టుకి అయినా వెళ్తామని ప్రకటించడం తో ఇంకా ఎన్ని రోజులు సమ్మె జరిగిన ఉపయోగం లేదని కార్మికులకు అర్ధం అయినట్లుంది.

ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు గళమెత్తి గర్జించినప్పటికీ ఫలితం లేదు. ఆర్టీసీ కార్మికులకు ప్రతి పక్షాల మద్దతు ఉపయోగం పడే రీతిలో లేదని చెప్పాలి. అంతేకాకుండా హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఫలితముగా ఆర్టీసీ సమ్మె ని నీరు గార్చే ప్రయత్నం మళ్ళీ చేసారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తిరిగి విధుల్లో జాయిన్ కావాలని నిర్ణీత గడువు ఇచ్చి కార్మికుల్ని ఆదేశించారు. అయినప్పటికీ లొంగని కార్మికులు సమ్మెను కొనసాగించారు.

ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ చలించడం లేదు. ప్రతి పక్షాలు, రాజకీయ నాయకులు విమర్శలు చేసినప్పటికీ ఫలితం లేదు. అయితే ఇదే నేపథ్యం లో పుట్టుకొచ్చిందే నిరాహార దీక్ష ఆలోచన. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి మరియు రాజిరెడ్డి లు దీక్ష చేపట్టగా పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్నటి హైకోర్టు నిర్ణయం తో దీక్షని కూడా విరమింపజేశారు.

దీక్షని విరమింపజేసినప్పటికీ అశ్వథామ రెడ్డి పలు సంచలన విషయాలను తెలిపారు. ప్రభుత్వంతో సుహృద్బావ వాతావరణంలో చర్చలు జరిగేందుకు వీలుగా సడక్ బంద్ ను విరమించుకున్నామని తెలియజేసారు. అయితే నిరాహార దీక్ష చేపట్టిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని కోదండరాం అన్నారు.

ఒక పక్క హైకోర్టు లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించిన కార్మికులకు చుక్కెదురైంది. ఆర్టీసీ సమ్మె విషయం లో కేసీఆర్ గెలిచాడని చెప్పాలి. హైకోర్టు లో అనుకూలంగా తీర్పు రాకపోవడం, లేబర్ కోర్ట్ కి కేసుని తరలించడం తో ఆర్టీసీ కార్మికులకు అనుకూలంగా వస్తుందా రాదా అనే సందిగ్ధంలో వున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మె ని విరమించే ఆలోచన చేస్తుంది కార్మిక సంఘం.

అయితే తెరాస ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అని ప్రతి ఒక్కరు ఆలోచనలో పడ్డారు. కేసీఆర్ రెండు సార్లు సమ్మె విరమింపజేయండి, విధుల్లోకి చేరండి అని ఆహ్వానించినా ఉపయోగం లేదు. అయితే హైకోర్టు తీసుకున్న నిర్ణయం తో తెరాస ప్రభుత్వం ఎం నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు.