బ్రేకింగ్: ప్రభుత్వ మొండి వైఖరి తో మరో ఆర్టీసీ కార్మికుడి మృతి!

Sunday, October 20th, 2019, 01:18:08 PM IST

తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. రెండు వారలు దాటినా ప్రభుత్వం చర్యలు ఏమి తీసుకోకపోవడం తో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు తెలుస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం సమ్మె విరమించి చర్చలకు రావాల్సిందిగా సూచించినట్లు తెలుస్తుంది, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ముందుగా డిమాండ్లని పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని తెలిపింది. ఇప్పటికే హోకోర్టు కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. చర్చల పై ఈ రోజు క్లారిటీ రానుందని అర్ధం అవుతుంది.

16 వ రోజుకి ఆర్టీసీ సమ్మె చేరుకోవడం తో కొంతమంది కార్మికులు చురుగ్గా సమ్మెలో పాల్గొంటున్నారు. ఖమ్మం సత్తుపల్లి డిపో డ్రైవర్ ఖాజామియా కి గుండెపోటు రావడం తో మరణించినట్లు తెలుస్తుంది. సమ్మె లో పాల్గొన్నపటికీ ప్రభుత్వ మొండి వైఖరితో మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సమ్మె తో ఎంతో మంది కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క సెల్ఫ్ డిస్మిస్ ప్రకటించిన కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ బంద్ కు ప్రజలు కూడా సహకరించడం తో కేసీఆర్ ఒక మెట్టు దిగి వస్తారో లేదో చూడాలి.