సమ్మెపై తమ నిర్ణయం చెప్పండి – గవర్నర్ తమిళసై కి ఆర్టీసీ కార్మికుల ఆవేదన

Tuesday, October 15th, 2019, 02:51:08 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఉగ్రరూపం దాల్చిన ఆర్టీసీ సమ్మెపై తక్షణమే స్పందించాలని ఆర్టీసీ కార్మికులు తెలంగాణ గవర్నర్ తమిళసై కి విన్నవించుకున్నారు. ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె 10 వ రోజుకు చేరుకుంది. ఈమేరకు ఆర్టీసీ కార్మికులు గవర్నర్ తమిళసై కలుసుకొని, ఒక వినతి పత్రాన్ని సమర్పించుకున్నారు. తాము న్యాయపరమైన డిమాండ్లతోనే ఈ సమ్మె ప్రారంభించారని, కానీ సీఎం కెసిఆర్ తన మొండి వైఖరితో తమ జీవితాలని నాశనం చేస్తున్నాడని, ప్రభుత్వానికి మీ వంతు సలహాలు చేయాలనీ ఆర్టీసీ కార్మికులు మొరపెట్టుకున్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలనీ ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కార్మికులు కోరుకున్నదాంట్లో ఆర్టీసీ ని ప్రభుత్వంలో కలపాలని అంటున్నారు. ఈ విషయమై అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చెప్పట్టారు. అయితే తెలంగాణలోని రాజకీయ పార్టీ లన్ని కూడా తమకు మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అసలే దిగిరావడం లేదని, కెసిఆర్ ప్రవర్తనతో విసుగెత్తిన కార్మికులు ఆత్మహత్య యత్నం కూడా చేశారని, కెసిఆర్ తన పంతంతో చాలా మంది ఉద్యోగాలు తొలగించారని వివరించారు. అయితే ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని గవర్నర్ తమిళసై వివరించారు.