రవితేజ ఫోకస్ .. ఆమె పైనే ఉందిగా ?

Saturday, February 11th, 2017, 12:18:25 PM IST


గత ఏడాది ఒక్క సినిమా కూడా మొదలు పెట్టలేదు రవితేజ. ”బెంగాల్ టైగర్” తరువాత కాస్త గ్యాప్ తీసుకుని హాలిడేస్ ని ఎంజాయ్ చేసిన రవితేజ ఈ సారి ఒకేసారి రెండు సినిమాలను మొదలు పెట్టాడు. ఆ రెండు సినిమాల్లో హీరోయిన్ గా రాసి ఖన్నానే ఎంపిక చేయడం విశేషం. బెంగాల్ టైగర్ తరువాత రవితేజ ఫోకస్ రాశి ఖన్నా పై పడిందని అందుకే ఆమెను తన నెక్స్ట్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా తీసుకున్నాడని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టచ్ చేసి చూడు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాల్లో రాశి ఖన్నా నటిస్తుండడం .. తో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. చాల రోజులుగా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ సాగుతుందని, అందుకే రవితేజ తన సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసాడని అంటున్నారు. మరో వైపు వీరిద్దరి వ్యవహారం పై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి !!