యుద్ధం వచ్చేస్తోంది .. అంటూ పుకార్లు

Friday, September 30th, 2016, 03:01:44 PM IST

indian-army
భారత దళాలు చేసిన సర్జికల్ స్త్రిక్స్ విషయం బహిరంగం ఆయిన వేళ భారత – పాకిస్తాన్ ల మధ్యన తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడింది. నిన్నటి నుంచీ క్షణ క్షణం ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలలో కంగారు పెరుగుతోంది. ఏ క్షణం లో అయినా ఒక ప్రాంతపు సైనికుల మీద మరొక ప్రాంతం వారు దాడి చెయ్యచ్చు అనీ, యుద్ధం ప్రారంభం అవ్వడానికి ఎంతో టైం లేదు అనీ వార్తలు రెండు దేశాల మధ్యనా పొగ పెంచుతున్నాయి. ప్రభుత్వం ఒక పక్కన ఇది కేవలం పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతం లో తీవ్రవాదుల మీద మాత్రమే జరిగిన దాడి అనీ , ఇందులో పాకిస్తాన్ కి ఎలాంటి సంబంధం లేద అనీ, తమ భూభాగం మీద టెర్రరిస్ట్ క్యాంపు లని ఉంచద్దు అని తాము చెబుతున్నా కూడా లెక్క చెయ్యని పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితిని తెచ్చుకుంది అనీ చెబుతున్నారు. యుద్ధం విషయంలో భారత్ ఎక్కడా ప్రకటన చెయ్యలేదు, కానీ సరిహద్దు ప్రాంతం లో మాత్రం ఇష్టం వచ్చినట్టు పుకార్లు పుడుతున్నాయి.. యుద్ధం వచ్చేస్తోంది అంటూ ప్రజలని భయానికి గురి చేస్తున్నారు కొందరు. భారత్ తన సరిహద్దు వెంబడి భారీగా దళాలను మోహరించింది. రంగంలోకి దిగిన ఎయిర్‌ఫోర్స్ విమానలు గస్తీ కాస్తున్నాయి. మరోవైపు సరిహద్దు భద్రతపై కేంద్ర కేబినెట్ కమిటీ నేడు భేటీకానుంది.