సీక్రెట్ మ్యారేజ్.. నా పరిస్థితి ఏంటని భయపడుతోన్న నయనతార !

Saturday, September 23rd, 2017, 02:09:45 PM IST

ముద్దు గుమ్మ నయనతార ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో ఎంత నాజూకుగా ఉండేదో ఇప్పుడు అంతకన్నా నయన్ అందం పెరిగిపోయింది. దీనితో మీడియా కళ్ళు ఆమె మీద పడ్డాయో లేక ప్రేమ వ్యవహారమొ తెలియదు కానీ నయనతార పెళ్లి గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లేనే నయన్ తన బాయ్ ఫ్రెండ్ తో రహస్య వివాహానికి సిద్ధం అయి పోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు తనకు డామేజ్ కలిగించే విధంగా మారడంతో నాయన తార తాజాగా వాటి గురించి ఓ ఇంటర్వ్యూ లో ఓపెన్ అయిపోయింది.

” నాగురించి లేనిపోనివి కల్పించి రాస్తున్నారు. ఓ వైపు నయనతారకు అవకాలు రావడం లేదని రాస్తున్న వారే, అందాల ఆరబోతలో రెచ్చిపోతోందని రాస్తారు. ఇలాంటి వార్తలని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను గ్లామర్ ఇండస్ట్రీ లో ఉన్నాను కాబట్టి న ప్రయత్నాలు నేను చేస్తాను. మడి కట్టుకు కూర్చొను. నా పెళ్లి గురించి అనేక అసత్యాలు రాస్తున్నారు. నా తలిదండ్రులు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. అలాంటి కన్నా వారికీ నా పెళ్లి విషయం చెప్పకుండా ఉంటానా.. ఇలాంటి వార్తలని రాసేవారు కాస్త ఆలోచించాలి. రేపు నాకు పెళ్లై అత్తింటి వారు ఈ పుకార్లని నిజమని నమ్మితే నా పరిస్థితి ఏంటి” అని నయనతార స్పందించింది. తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని తేల్చేసింది.

  •  
  •  
  •  
  •  

Comments