డైవోర్స్ తీసుకున్న రష్యా అధ్యక్షుడు

Friday, June 7th, 2013, 02:19:42 PM IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన సతీమణి ల్యుడ్ మిల తో 30 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని స్వయంగా ఇద్దరూ ప్రకటించారు. తమ విషయంలో సుదీర్ఘకాలంగా వస్తున్న ఊహాగానాలు, పుకార్లు నిజమేనని చెప్పారు. తమ మధ్య విభేదాలున్నాయని పుతిన్ ఓ టెలివిజన్ కార్యక్రమంలో ఒప్పుకున్నారు.

క్రెమ్లిన్‌లో ఓ బాలే ప్రదర్శనకు హాజరైన తర్వాత ప్రభుత్వ టెలివిజన్‌లో వారిద్దరూ ఈ ప్రకటన చేశారు. ఇది తామిద్దరి సంయుక్త నిర్ణయమని పుతిన్ తెలిపారు. ఈ సమయంలో ల్యుడ్ మిలా కూడా పక్కనే ఉన్నారు. 1983 లో వివాహం చేసుకున్న వీరిద్ధరికీ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పుతిన్ సుదీర్ఘ కాలంగా రష్యా రాజకీయాల్లో ఉన్నా, ఆయన భార్య ల్యూడ్మిలా మాత్రం ఎప్పుడూ ప్రజల్లో కనిపించరు. తనకు ప్రచారం అంటే ఇష్టం లేదని ఆమె చెబుతారు.