ఆర్‌.ఎక్స్ 100 బ్యూటీ ల‌క్కీ చాన్స్‌

Wednesday, July 25th, 2018, 11:17:39 PM IST

సెన్సేష‌న్స్ కోసం వ‌ల్గారిటీ అన్న ప‌ద్ధ‌తి రాజ్య‌మేలుతోందిప్పుడు. అయితే ఆ వ‌ల్గారిటీనే మెప్పించేలా శ్రుతిమించ‌కుండా చూపించ‌గ‌లిగితే ఆర్‌.ఎక్స్ 100 లాంటి హిట్టు కొట్టొచ్చు. క‌ళాపోష‌ణ ఉండాలే కానీ, బూతు స‌న్నివేశాన్ని సైతం ఎంతో క‌ళాత్మ‌కంగా చూపించొచ్చు.ఆ పంథాలో ఆర్‌.ఎక్స్‌100 మేక‌ర్స్ స‌క్సెస‌య్యారు. ఇక ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్ అంద‌చందాల్ని ఏ మోతాదులో చూపించాలో, పెద‌వి ముద్దుల మోతాదు ఎంత ఉండాలో పెర్ఫెక్ట్‌గా డిజైన్ చేయ‌డం సినిమాకి బాగా క‌లిసొచ్చింది. యూత్‌లో ఈ సినిమా గురించి వైర‌ల్‌గా ప్ర‌చారం సాగ‌డంతో 400శాతం క‌లెక్ష‌న్స్‌తో బంప‌ర్‌హిట్ అందుకుంది.

ఇక‌పోతే పాయ‌ల్ వ‌ల్ల‌నే ఈ విజ‌యం ద‌క్కింద‌న్న ప్ర‌చారంతో ఈ అమ్మ‌డి క్రేజు అమాంతం స్కైని ట‌చ్ చేసింది. ఆ క్ర‌మంలోనే త‌న కెరీర్ రెండో అవ‌కాశం అందుకుంది క్రేజీగా. ఈసారి ది గ్రేట్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఈ అమ్మ‌డు న‌టించ‌నుందిట‌. ఇంత‌కీ హీరో ఎవ‌రు? అంటే బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ అని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీ‌ను న‌టించిన సాక్ష్యం రిలీజ‌వుతోంది. త‌దుప‌రి తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఇక ఇదే చిత్రంలో రెండో నాయిక‌గా ఆర్‌.ఎక్స్ బ్యూటీ మెరుపులు మెరిపిస్తుందిట‌. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీల్ని తెర‌కెక్కించ‌డంలో, నాయ‌కానాయిక‌ల మ‌ధ్య శృంగార స‌న్నివేశాల్ని పండించ‌డంలో తేజ‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఈ భామ రోల్ అదిరిపోయే రేంజులో ఉంటుంద‌ని అప్పుడే యూత్ అంచ‌నా వేస్తున్నారు. మ‌రి పాయ‌ల్ ద్వితీయ ప్ర‌య‌త్నం జాక్‌పాట్ లాంటిదే. ఇక మునుముందు నాలుగైదు అడ్వాన్సుల్ని చ‌క‌చ‌కా అందుకోవ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నా వేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments