ఆర్ఎక్స్100 బ్యూటీ .. టాప్ లేపేస్తోంది!

Tuesday, June 12th, 2018, 10:22:55 AM IST

టీవీ రంగం నుంచి ఇప్ప‌టికే ప‌లువురు క‌థానాయిక‌లు వెండితెర‌ను ఏల్తున్న సంగ‌తి తెలిసిందే. బుల్లితెర‌పై ఓ వెలుగు వెలిగిన ఊర్వ‌శి రౌతేలా హేట్‌స్టోరి 4లో దుమ్ము దులిపేసింది. అందాల ఆర‌బోత‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆ అమ్మ‌డిని మ‌ర్చిపోక ముందే మ‌రో అమ్మ‌డు బ‌రిలో దిగింది. ఈ భామ పేరు పాయ‌ల్ రాజ్‌పుత్‌.

ఇదిగో ఈ ఫోటో చూస్తే ఇక ఎవ‌రూ ఏదీ చెప్పాల్సిన ప‌నేలేదు. పాయ‌ల్ అంద‌చందాలు కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్ట‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఆర్ఎక్స్ 100 ప్రోమోలు, పోస్ట‌ర్ల‌లో పాయ‌ల్ లుక్‌పై వాడి వేడి చ‌ర్చ సాగింది. ఈ భామ‌ ఘాటైన లిప్‌లాక్‌లు, వేడెక్కించే స‌న్నివేశాల‌తో దుమ్ము రేపేసింది. హిందీ టీవీ సీరియ‌ళ్ల‌తో ఆక‌ట్టుకున్న ఈ భామ ఇక‌పై వెండితెర‌ను ఏలాల‌ని క‌ల‌లుగంటోంది. త్వ‌ర‌లోనే ఆర్‌.ఎక్స్ 100 రిలీజ్‌కి వ‌స్తున్న వేళ ఇన్‌స్టాగ్ర‌మ్‌లో 2ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్‌కి కునుకుప‌ట్ట‌నీకుండా చేస్తోంది ఈ అమ్మ‌డు. ఇదిగో ఇలా టాప్ లేపేస్తోంది.. ద‌ట్సిట్‌!!

  •  
  •  
  •  
  •  

Comments