ఇళయరాజాకు అభినందనలు తెలిపిన బాలు ?

Saturday, January 27th, 2018, 01:40:20 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయకుడూ ఎస్పీ బాలు హర్షం వ్యక్తం చేసాడు. ఈ సందర్బంగా బాలు ట్విట్టర్ లో స్పందిస్తూ పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన శ్రీ ఇళయరాజా గారికి అభినందనలు .. ఈ అవార్డుకే అందం వచ్చింది అంటూ కామెంట్ పెట్టాడు. ఈ మధ్య బాలుకు, ఇళయరాజాకు మధ్య సైలెంట్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలు .. ఇళయరాజా కు అభినందనలు చెప్పడం ఆసక్తి రేపింది.