సింగం 3 విడుదల మళ్లీ వాయిదా..?

Wednesday, February 8th, 2017, 02:41:19 PM IST


ఈ మధ్య కాలంలో ఓ చిత్రం విడుదల ఎక్కువ సార్లు వాయిదా పడిందంటే అది సింగం 3 నే. సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది.ఈ చిత్ర విడుదలని పలు అంశాలు ఇప్పటికే అడ్డుకున్నాయి. జల్లికట్టు నిరసనల సమయం లోకూడా ఈ చిత్రం వాయిదా పడింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబందించిన వార్త అటు తెలుగు, తమిళ సినీవార్తల్లో మొదలయింది. తమిళనాడు లో ప్రస్తుంతం రాజకీయపరమైన అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యం లో సింగం 3 విడుదల పై నిర్మాతలు మల్ల గుల్లాలు పడుతున్నారట. మరో మారు సైతం చిత్రాన్ని వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ చిత్ర విడుదల వాడిదా పడడంపై అధికారిక సమాచారం రాలేదు. రాజకీయంగా తమిళనాడులో అనిశ్చితి నెలకొని ఉన్న కారణం గా ఈ సమయం లో చిత్రం విడుదల సరైంది కాదని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే ఫిబ్రవరి 9 న విడుదలకు సిద్ధమైపోయిననేపథ్యం లో ,మళ్లీ వాయిదా పడుతుందా అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం పుకారేనా, దీనిలో నిజమమెంత అనే విషయం నిర్మాతలే తెలియజేయాలి. హరి దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రం లో సూర్య సరసన అనుష్క , శృతిహాసన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.