సాహో ప్రభాస్ వచ్చేశాడు.. ఫస్ట్ లుక్ అదిరింది

Monday, October 23rd, 2017, 10:03:53 AM IST

బాహుబలి సినిమాతో సంచలనం సృష్టించిన ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కూడా సాహో సినిమాతో మళ్లీ బాహుబలి రేంజ్ లో రికార్డులు సృష్టించాలని సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సాహో చిత్రం ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. గత కొంత కాలంగా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా సాహో ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ లుక్ ని రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ లుక్ లో ప్రభాస్ సూపర్ గా ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.