ప్రభాస్ అభిమానులకు గట్టి పరీక్షే పెడుతున్న “సాహో”..!

Tuesday, September 11th, 2018, 06:52:21 PM IST

యంగ్ రెబల్ స్టార్ “ప్రభాస్”. అభిమానులు ముద్దుగా “డార్లింగ్” అని పిలుచుకుంటారు. ఈ పేరు ముందు టాలీవుడ్ కి మాత్రమే పరిమితం ఎప్పుడైతే రాజమౌళితో బాహుబలి చిత్రం మొదలు పెట్టాడో అప్పటి నుంచి భారతదేశం అంతా “డార్లింగ్” అయ్యిపోయాడు.ఒక్కసారిగా రేంజ్ అంతా మారిపోయింది కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడు ఆ హుందా తనాన్ని వ్యక్తపరుచుకోడు. ఎప్పుడు చిరు నవ్వుతో సరదాగా అందరిని పలకరిస్తాడు. బాహుబలి రెండు చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించాడో వేరే చెప్పనక్కరలేదు. ఐతే ఆ తర్వాత నటిస్తున్న సాహో చిత్రం మాత్రం తమ అభిమానుల సహనానికి పెద్ద పరీక్షే పెడుతుంది.

అస్సలే బాహుబలి రెండు చిత్రాలకి 5 ఏళ్ళు ఎంతో కష్టపడ్డాడు ఆ సమయంలో ఆ సినిమాలో నటించిన తారలు అందరు వేరే సినిమాల్లో నటించారు , కానీ ప్రభాస్ మాత్రం వేరే ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. ఆ సినిమా కోసమే అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు. ఎట్టకేలకు ఆ చిత్రం విడుదల రోజునే “రన్ రాజా రన్” దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న “సాహో” చిత్రం యొక్క చిన్న టీజర్ ని కూడా పెట్టడం తో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు,2018 లోనే విడుదల కావాల్సిన చిత్రం ఇంకా విడుదల కాలేదు. అభిమానుల కళ్ళు కాయలు కాచి ఇప్పుడు పువ్వులు కూడా పూసేస్తున్నాయి. ఎదో మొక్కుబడిగా మధ్యలో ఒక చిన్న పోస్టర్ విడుదల చేసారు. అది కూడా విడుదల చేసి ఒక ఏడాది దగ్గరకి కావస్తుంది, ఈ సారి అయినా ప్రభాస్ పుట్టినరోజుకి ఏదైనా టీజరో లేక ట్రైలరో విడుదల చేస్తారేమో అని ఎంతో ఆత్రంగా వారి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సారి అయినా వారి అభిమానులను నిరాశపరచకుండా ఏదైనా ఊహించని బహుమతి సాహో టీం నుంచి వస్తే బాగుంటుంది అని అందరు ఆశిస్తున్నారు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మితమవుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments