స‌చిన్ గారాల ప‌ట్టీ బాలీవుడ్ ఎంట్రీ షురూ..

Sunday, September 24th, 2017, 07:40:51 PM IST

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్క‌ర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఖాయ‌మైన‌ట్టేన‌న్న‌ది ఉత్త‌రాది మీడియా చెబుతున్న‌ మాట‌. సారా ఎంట్రీపై గ‌త కొంత‌కాలంగా మీడియాలో ర‌చ్చ సాగుతున్నా ఫ‌లానా సినిమా అంటూ ప్ర‌క‌టించిందేం లేదు. అయితే తండ్రికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ గారాల కుసుమం ఘ‌నంగానే తెరంగేట్రం చేయాల‌ని భావిస్తోందిట‌. ఓ భారీ కాన్వాసు ఉన్న ప్రాజెక్టులో అద్భుత‌మైన ఇమేజ్ ఉన్న హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు స‌న్నాహాలు చేసుకుంటోంద‌ని తెలుస్తోంది.

బాలీవుడ్ చాక్లెట్ బోయ్ ర‌ణ‌బీర్ క‌పూర్ లేదా ట్యాలెంటెడ్ ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న అవ‌కాశం వ‌స్తే న‌టించాల‌న్న‌ది ప్లాన్‌. ఇక సారా ఎంట్రీ కోసం మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప‌క్కా ప్లాన్ వేస్తున్నాడుట‌. సెల‌బ్రిటీలు చ‌దువుకునే ధీరూభాయ్ అంబానీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో విద్యాభ్యాసం సాగిస్తున్న సారా ప్ర‌స్తుతం యుక్త‌వయ‌సు మిస‌మిస‌ల‌తో ఊగిపోతోంది. ఇక క‌థానాయిక‌గా ఎంట్రీ ఇవ్వ‌డం కోసం త‌హ‌త‌హ క‌న‌బ‌రుస్తోంది. త‌న క‌ల నెర‌వేర్చుకోవ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతోందిట‌. ఈ హ‌డావుడి చూస్తుంటే క‌చ్ఛితంగా సారా తండ్రి గౌర‌వం పెంచేంత పెద్ద స్టార్ అవుతుంద‌నే అనిపిస్తోంది. చూద్దాం.. ఏం జ‌రుగుతోందో?

  •  
  •  
  •  
  •  

Comments