కష్టాల్లో ఉన్న భారత్ కి సచిన్ అండ

Sunday, February 26th, 2017, 11:34:49 AM IST


ఆస్ట్రేలియా సీరీస్ అనగానే తెలుగు ప్రేక్షకులు అందరూ తెగ ఉత్సాహా పడ్డారు. భారత్ కి చేరుకున్న ఆస్ట్రేలియా కి ఇండియన్ క్రికెట్ టీం చుక్కలు చూపిస్తుంది అని ఫీల్ అయిన వారికి రివర్స్ లో చుక్కలు కనపడ్డాయి. జరిగిన మొదటి టెస్ట్ లో దారుణ పరాజయం లో మునిగిపోయింది భారత్. వీరందరికీ లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అండగా నిలిచారు. ఈ ఉదయం ఢిల్లీలో జరిగిన 21 కిలోమీటర్ల మారథాన్ లో పాల్గొన్న సచిన్, మీడియాతో మాట్లాడారు. ఇండియా జట్టు సిరీస్ ను కోల్పోలేదని, మన ఆటగాళ్లలో పోరాటపటిమ ఉందని అన్నారు. ఒక్క ఓటమిని చవి చూసినంత మాత్రాన పోరాడలేక చేతులు ఎత్తేసినట్టు భావించరాదని, తదుపరి జరిగే మ్యాచ్ లలో భారత ఆటగాళ్లు పుంజుకుని, మంచి ప్రదర్శన ఇస్తారన్న నమ్మకం ఉందని సచిన్ చెప్పారు.