సచిన్ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లాన్..!

Friday, September 6th, 2013, 05:38:31 PM IST

sachin
మాస్టర్ బ్లాస్టన్ సచిన్ కు అరుదైన గౌరవం ఇవ్వాలని బీసీసీఐ యోచించింది. అనుకుందే తడువుగా సౌతాఫ్రికా టూర్ ను పక్కనపెట్టేసి వెస్టిండీస్ తో సిరీస్ ను కన్ఫామ్ చేసింది. సచిన్ 200వ టెస్టు భారత గడ్డపై ఆడాలన్న సంకల్పంతో బీసీసీఐ మాస్టర్ ప్లానేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి 200వ టెస్టు సచిన్ ఎక్కడ ఆడాలనుకుంటే ఆక్కడ ఆడిస్తామని చెబుతోంది.

మాస్టర్ బ్లాస్టర్ వాల్డ్ క్రికెట్లో దాదాపు ఎవరు అందుకోలేని అరుదైన ఫీట్ ను అందుకోబోతున్నాడు. ఒకదేశానికి ఒక టెస్టు మ్యాచ్ ఆడడమే గొప్పగా భావిస్తారు. అలాంటిది ఒకదేశం తరుపున 200 టెస్టులు కంప్లీట్ చేయబోతున్నాడు. ఇప్పటివరకు 198 టెస్టులు ఆడిన మాస్టర్ మరో రెండు టెస్టులు ఆడితే.. రేర్ రికార్డును సాధిస్తాడు. ఎక్కడో సౌతాఫ్రికాలో ఆ రికార్డు చేస్తే పెద్దగా పేరు ఉండదని భావించింది బీసీసీఐ. ఆలోచన వచ్చిందే తడువుగా….200వ టెస్టు భారత గడ్డపైనే జరిపించాలని తీర్మానించింది. సౌతాఫ్రికా బోర్డు సీఈవోతో ఎలాగూ గొడవలు ఉన్నాయి కాబట్టి.. అక్కడ ఆడడం కంటే ఇక్కడ ఆడితేనే ఘనత ఉంటుందని భావించిన బోర్డు వెస్టిండీస్ తో సిరీస్ ను ఒకే చేసి 200వ టెస్ట్ భారత గడ్డపైనే ఆడేలా ప్లాన్ చేసింది.

సచిన్ కు మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. 200వ టెస్టు వేదికను సచిన్ ఎక్కడ కోరుకుంటే అక్కడ నిర్వహిస్తామని బీసీసీఐ తీర్మానించింది. సచిన్ను గౌరవించడంలో భాగంగా సచిన్ ఆ టెస్టును ఏ వేదికలో నిర్వహించమంటే ఆ వేదికలో నిర్వహిస్తామని తెలిపింది. సచిన్ కు భారత్ లోని అన్ని టెస్టు వెన్యూలు ఫేవరెటే.. బెంగళూర్, చెన్నై, కోల్ కతా, అ హ్మదాబాద్ లలో సచిన్ పరుగుల వరద పారించాడు. ఎక్కడ ఆడినా సచిన్ను చూసేందుకు స్టేడియానికి అభిమానులు తరలి వస్తారు. ఇప్పుడు బీసీసీఐ సచిన్ ఇష్టమని చెబుతుండడంతో ఒకింత సచిన్ ఇరాకటంలో పడ్డాడు.

తాను పుట్టిపెరిగిన ముంబైలో ఆడాలని సచిన్ కు ఉన్నా మిగతా ప్రదేశాల్లోనూ సచిన్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఫ్యామిలి మెంబర్స్, ఫ్రెండ్స్ మథ్య అరుదైన ఘనత అందుకోవాలనుకోవడం సహజం. కాబట్టి సచిన్ ముంబై వాంఖడేనే వేదికగా చేసుకుంటాడని తెలుస్తోంది. మాజీ క్రికెటర్లు కూడా ముంబైలోనే ఆడాలని సలహా ఇస్తున్నారు. అయితే సచిన్ తనకు ఇబ్బంది లేకుండా బీసీసీఐనే వెన్యూ సెట్ చేయాలని కోరే ఛాన్సుంది.

రొటేషన్ పద్దతి ప్రకారం 200వ టెస్టు వేదిక అహ్మదాబాద్ కు వస్తుంది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కూడా సచిన్ 200వ టెస్టును మేమే కండక్ట్ చేస్తామని బీసీసీఐకి లెటర్ పెట్టింది. అంతేకాదు ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో ఒత్తిడి పెంచింది. మోడీ కూడా సచిన్ 200వ టెస్టు అహ్మదాబాద్ సర్ధార్ వల్లబాయ్ పటేల్ స్టేడియంలోనే ఆడాలని కోరుతున్నాడు. మరోవైపు బెంగాల్ క్రికెట్ అసోసియేఫన్ కూడా చారిత్రక టెస్టుకోసం పట్టుబడుతోంది. పనిలో పనిగా అనిల్ కుంబ్లే కూడా పట్టుబడుతున్నాడు. 200వ టెస్టుకానీ అంతకు ముందు జరిగే 199వ టెస్టుకానీ బెంగళూర్ కు ఇవ్వాలని బీసీసీని కోరాడు కుంబ్లే మొత్తానికి సచిన్ 200వ టెస్టు ఎక్కడ ఆడతాడో అనేది సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంది.