తెల్లారితే పుట్టిన రోజు,గృహ ప్రవేశం ఈలోపే తెలుగు జంటను కబళించిన విషాదం.!

Wednesday, February 26th, 2020, 11:53:41 AM IST


సరిగ్గా తెల్లారితే తాము ఎంతో ఇష్టంగా కట్టుకున్న సొంతింటిలో దిగడం అలాగే అదే రోజున తన అర్ధాంగి జన్మదిన వేడుకలు ఇలా కలిసి రావడం ఎవరికైనా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.కానీ అమెరికాలో ఉన్నటువంటి మన దేశపు అందులోనూ మన తెలుగు వారికి ఆ అదృష్టాన్ని ముత్యువు రూపంలో వచ్చి కబళించింది.ఏపీ కి చెందిన రాజా అలాగే హైదరాబాద్ గాంధీ నగర్ కు చెందిన దివ్య ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.

చిన్నప్పటి నుంచీ స్నేహితులుగా సాగి వృత్తి పరంగా ఒకటే అయి ఇరువురు భార్యాభర్తలు అమెరికాలోని విశ్వనాథ్ అనే తమ స్నేహితుని ఇంట్లో ఉంటూ తమ కష్టార్జితంతోనే తమకు సమీపంలో టెక్సాస్ రాష్ట్రంలో ఎంతో ఇష్టపడి ఓ ఇల్లు కొనుగోలు చేసుకున్నారు.భారత కాలమాన ప్రకారం బుధవారం కొత్త ఇంటిలో అడుగు పెట్టడం అలాగే దివ్య పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుదాం అని అనుకునే లోపే దివ్య తల్లిదండ్రులకు ఈ వార్త చేరి కన్నీటి పర్యంతం చేసేసింది.

అక్కడ భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటలకు ముందు దివ్య మరియు రాజాలు తమ ఏడేళ్ల పాపను డాన్స్ స్కూల్ లో వదిలి ప్రిన్స్కో వైపుగా తమ కార్ లో వస్తున్నప్పుడు అటుగా మరో వాహనం అత్యంత వేగంగా వచ్చి తాకడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఘటనలో తమకు ఇన్నాళ్లు ఆశ్రయం ఇచ్చిన విశ్వనాథ్ కూడా అదే కారులో ఉండడం మరింత విచారకరం.