ఫోటో టాక్ : సదా పిచ్చెక్కించేసిందిగా..!

Friday, December 1st, 2017, 09:50:47 PM IST

జయం, అపరిచితుడు సినిమా పేర్లు చెప్పగానే హీరోయిన్ సదా టక్కున గుర్తొచ్చేస్తుంది. అందం, నటన సమపాళ్లలో కనబరుస్తూ వెండి తెరపై మంచి మార్కులనే కొట్టేసింది ఈ అమ్మడు. అయితే ఆ తరువాత పరాజయాలు ఎదురుకావడంతో చాన్సులు తగ్గి టివి షోలకు మాత్రమే పరిమితం అయింది. కాగా సదా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. టార్చ్ లైట్ అనే తమిళ చిత్రంలో ఈ అమ్మడు లీడ్ రోల్ చేస్తోంది.

ఆ చిత్రానికి సంబందించిన సదా ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. తన నడుము అందంతో బ్యాక్ ని సదా ఎక్పోజ్ చేస్తున్న ఫోజు కుర్రలని పిచ్చెక్కిస్తోంది. ఖచ్చితంగా ఈ చిత్రం సదాకు కంబ్యాక్ చిత్రం అవుతుందని అంటున్నారు. గ్యాప్ వచ్చినా తన అందంలో ఎలాంటి తరుగుదల లేదని సదా ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా చెప్పకనే చెబుతోంది. ఓ యదార్ధ గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సదా ఈ చిత్రంలో కాల్ గర్ల్ పాత్రని పోషిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments