జనసేనాని విషయంలో సాధినేని యామిని తప్పు తెలుసుకుందా?

Saturday, June 1st, 2019, 10:38:16 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం అనంతరం అతన్ని ఎంత మంది ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసారో అందరికీ తెలుసు..అతని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ఏదోకటి అంటూ వార్తా మాధ్యమాల్లో అలా ఎవరొకరు కనిపిస్తూనే ఉండేవారు.అలా పవన్ పేరు చెప్పి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన వారిలో తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా ఒకరు.

ఆ సమయంలో పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పుడు జనసేన శ్రేణులు సహా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి.దీనితో జనసేన పార్టీ అభిమానులు సాధినేని యామిని పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.తాను పవన్ విషయంలో అప్పుడు అలా మాట్లాడి ఉండకూడదు అని తాను ఆ సమయంలోనే టీడీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టి రెండు రోజులు మాత్రమే అయ్యిందని అందుకే కాస్త తన అవగాహనా రాహిత్యం వల్ల అలా మాట్లాడాను తప్ప పవన్ ను కావాలనే అలా అనలేదు అని తన తప్పును ఒప్పుకున్నారు.