పవన్ కళ్యాణ్ ని అలా అన్నందుకు చాలా ఆలోచించా–సాధినేని యామిని

Sunday, November 17th, 2019, 09:21:32 AM IST

సాధినేని యామిని తాజాగా ఆసక్తికర విషయాలని ప్రజలకు తెలియజేసారు. పవన్ కళ్యాణ్ పై ఎన్నికల ముందు చేసిన వ్యాఖ్యలతో తనని చాలామంది మల్లెపూల యామిని అంటూ పిలిచారని తన ఆవేదనని వ్యక్తం చేసింది. అయితే ఈ విషయం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గతం లో చేసిన విమర్శలను గుర్తు చేసుకొని, నేను చెప్పాలనుకుంది సరిగ్గా చేపలేకపోయానని అన్నారు. చెప్పాలనుకుంది ఒకటైతే, అది ఇంకొక రకంగా అర్థమైందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అలా అనుకొనే వారిని తన పిల్లల షూ తీసుకొని కొట్టాలనిపించిందని యామిని తన కోపాన్ని తెలియజేసారు.

అయితే సాధినేని యామిని పార్టీ మారే విషయం లో చాల పుకార్లు వచ్చాయి. అంతేకాకుండా వైసీపీ లోకి వెళ్ళెదనుకు ప్రయత్నించానని తన పై వస్తున్న పుకార్లని కొట్టిపారేసింది. తాను వైసీపీ లోకి చేరేందుకు ప్రయత్నించానని, వైసీపీ వాళ్ళు తలుపులు మూసేశారని వస్తున్నా కథనాలు అసత్యం అని చెప్పారు. అయితే రాజకీయాల్లోకి ప్రజా సేవ చేయడానికి వచ్చానని, అంతేకాని ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం కాదు అంటూ గట్టిగానే తన భావాన్ని తెలియజేసారు.