సాదినేని యామిని సీరియస్ వార్నింగ్ – ఎందుకో తెలుసా…?

Sunday, November 17th, 2019, 02:00:50 AM IST

గతంలో టీడీపీ తరపున ఫైర్ బ్రాండ్ గా పేరు తెచుకున్నటువంటి సాదినేని యామిని ఇటీవలే పార్టీ కి గుడ్ బై చెప్పిన సంగతి మనకు తెలిసిందే. కాగా యామిని తాజాగా ఒక ప్రైవేట్ మీడియా వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. తనని ఎవరైతే మల్లెపూల యామిని అని పిలుస్తారో వారందరిని కూడా చెప్పుతో తంతా అని వార్నింగ్ ఇచ్చింది. కాగా ‘నేను పిల్లలు ఉన్నదాన్ని, నాపైన వివాదాస్పద వాఖ్యలు చేసిన వారిని, మా పిల్లలు స్కూల్ కి వెళ్లొచ్చిన బురద మాయమైన బూట్లతో వారితోనే కొట్టించాలి అని అన్నారు. అంతేకాకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారని యామిని కొంత ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపోతే ఎప్పుడు గతంలో ఎవరిమీదనో చేసిన వాఖ్యలని ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్చడం సరి కాదని, దానికి తోడు ఇప్పుడు తనమీద ఇంకా ట్రోల్స్ వస్తున్నాయని, నేను మల్లెపూలు పెట్టుకుంటే, నా పేరు మల్లెపూల యామిని గా పేరు మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని యామిని వార్నింగ్ ఇచ్చారు.