సాగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కి కరోనా పాజిటివ్..!

Monday, April 19th, 2021, 07:41:39 PM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు మొన్న పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ప్రచారం, పోలింగ్ ఎఫెక్ట్ కారణంగా సాగర్‌లో కేసుల సంఖ్య ఒక్క సారిగా పెరిగింది. నియోజకవర్గంలో మొత్తం ఇవాళ 160 కరోనా కేసులు నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల‌ భగత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే వీరితో పాటు టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకిందని, కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలలో చాలా మంది కరోనా బారిన పడినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న చాలా మంది నేతలు హోం క్వారంటైన్‌కి వెళ్ళినట్టు తెలుస్తుంది.