సాహో లుక్కు వెనుక గుట్టు తెలిసిపోయింది..!

Monday, October 23rd, 2017, 07:40:18 PM IST

ప్రభాస్ పుట్టినరోజు కానుకగా సాహో చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ లుక్ లో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా ఉండడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ మరికొందరు సినీ అభిమానులు మాత్రం ఈ లుక్కు వెనుక ఉన్న అసలు గుట్టుని కనిపెట్టేశారు. సాహో ఫస్ట్ లుక్ కాపీ అని తేల్చేస్తున్నారు.

హాలీవుడ్ చిత్రం ‘బ్లేడ్ రన్నర్ 2049’ ఆధారంగా రూపొందించినట్లు అర్థం అవుతోంది. ముఖానికి ఓ గుడ్డ చుట్టుకుని ప్రభాస్ నడచి వస్తుండే లుక్ ని విడుదల చేశారు. ప్రభాస్ కటౌట్ కి ఆ పోస్టర్ బాగా సరిపోయింది. కానీ కాపీ కొట్టి రూపొందించారనే విమర్శలు మాత్రం తప్పడం లేదు. సాహో చిత్రం హాలీవుడ్ తరహాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments