100 మిలియన్ వ్యూస్ తో సహోరే బాహుబలి సంచలనం ?

Friday, March 2nd, 2018, 03:10:45 PM IST

బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా. ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు యావత్ ప్రపంచం సలాం కొట్టింది. తాజాగా బాహుబలి లో సాహోరే బాహుబలి .. సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ యూ ట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దాటేసి సంచలనం రేపింది. ఓ సాంగ్ ఈ రేంజ్ లో వ్యూస్ సాధించడం నిజంగా [పెద్ద రికార్డ్ అని చెప్పాలి. సహోరే .. అంటూ బాహుబలి వీరత్వాన్ని పొగుడుతూ కీరవాణి స్వర కల్పనా చేసిన ఈ పాట ఏంతో మంది ప్రేక్షకులకు ఫేవరేట్ సాంగ్ గా మారింది. లహరి మ్యూజిక్ ద్వారర్ 86 మిళియన్స్ ప్రేక్షకులు వీక్షించగా .. దిల్ రాజు ఛానల్ ద్వారా 18 మిళియన్స్ మంది చూసారు. మొత్తంగా 100 మిలియన్ వ్యూస్ తో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది ది గ్రేట్ బాహుబలి.