తేజ్ ఐ లవ్యూ… ఫస్ట్ లుక్ రిలీజ్

Saturday, April 28th, 2018, 11:10:05 PM IST

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా కరుణాకరన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఇంటిలిజెంట్‌‌’ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. క్రియేటివ్‌ కమర్షియల్‌‌ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. గోపీ సుందర్‌ బాణీలు అందిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘తేజ్‌.. ఐ లవ్యూ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో పియానో వాయిస్తున్న అనుపమను సాయిధరమ్‌ ప్రేమగా చూస్తూ కనిపించారు. వీరి చుట్టూ పరిసరాలు పచ్చటి పూలమొక్కలు, సీతాకోక చిలుకలతో నిండి ఉంది. మే 1న సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఈ తొలి ప్రచార చిత్రంలో పేర్కొన్నారు.

వి.వి వినాయక్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ నటించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

  •  
  •  
  •  
  •  

Comments