అల్లుడు జాగ్రత్త పడుతున్నాడు .. ఇప్పుడైనా ఫేట్ మారేనా ?

Wednesday, July 25th, 2018, 11:14:08 PM IST

ఏకంగా డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో చాలా టెన్షన్ మీదున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. వరుసగా అరడజను ప్లాప్ సినిమాలంటే మాటల. ఇక కొత్త అవకాశాలు ఏమో గాని మార్కెట్ మాత్రం డౌన్ అయింది. చివరిగా అయినా ప్రేమ కథల ఎక్స్ పర్ట్ అయినా కరుణాకరన్ తో తేజ్ ఐ లవ్ యూ చేసాడు .. కానీ అది పెద్ద ఫ్లాప్ అయిపోయింది. దాంతో నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం అయన నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల తో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా విషయంలో తేజ్ తన లుక్ తో పాటు యాక్టింగ్ విషయంలో కూడా మార్పులు చేయాలనీ భావిస్తున్నాడట. దానికోసం ముంబై వెళ్లి లుక్ విషయంలో మేక్ ఓవర్ మార్చే పనిలో ఉన్నాడు . ఈ విషయం కోసం తేజ్ మూడు నెలల సమయం కావాలని దర్శకుడికి చెప్పాడట. సో న్యూ లుక్ లోనే కిషోర్ తిరుమల సినిమా మొదలవుతుంది. అంటే నవంబర్ లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి న్యూ లుక్ అయినా తేజ్ ఫేట్ మారుస్తుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments