డ్రంక్ అండ్ డ్రైవ్ లో మెగా హీరో .. కానీ ?

Saturday, May 19th, 2018, 03:34:37 PM IST

ఈ మధ్య మందుబాబులు ఎక్కువవుతున్నారని .. హైద్రాబాద్ పోలీసులు కాస్త గట్టిగానే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ మందుబాబుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. హైద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విరివిగా నిర్వహిస్తూ మందుబాబులు ఎవరు తాగి బళ్ళు , కార్లు నడపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక జూబిలీ హిల్స్ లో ఎప్పటిలాగే నిన్న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురు అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా 22 కార్లు, 29 బైక్ లను సీజ్ చేసి వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పెట్టారు .. అదే సమయంలో అటుగా వెళుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు ..అందులో సాయి ధరమ్ బ్రెత్ 0 వచ్చిందట .. సాయి ధరమ్ మందు తాగకపోవడంతో ఆయనను వదిలేసారు. అది విషయం.

  •  
  •  
  •  
  •  

Comments